police caught jabardast artist in drunk and drive: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంత హెచ్చరించినా, దయచేసి మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎంత విజ్ఞప్తి చేసినా..మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫుల్లుగా తాగి వాహనంతో రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నారు. తమ ప్రాణాలను రిస్క్ లో వేసుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో చాలామంది దొరికారు. 30మందికిపైగా డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కారు. వీరిలో జబర్దస్త్ ఆర్టిస్ట్ తన్మయి కూడా ఉన్నాడు. తన్మయి జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తాడు. తన్మయితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలు సీజ్ చేసి వారందరిపై కేసులు నమోదు చేశారు.
మిగతా రోజులతో పోలిస్తే వీకెండ్స్ లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లను ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శుక్రవారం(ఫిబ్రవరి 5,2021) కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేస్తుండగా తన్మయి పట్టుబడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరుస్తామని, శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగుబోతులు చేస్తున్న పనుల వల్ల ఏ తప్పు చేయని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే తాగుబోతుల పని పడుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అలాగే జైలుకి కూడా పంపిస్తున్నారు. కఠిన శిక్షలూ వేస్తున్నారు. అయినా తాగుబోతుల్లో మార్పు రాకపోవడం బాధాకరం.