Abdullahpurmet
Abdullahpurmet : రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్‌పూర్‌లో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. 2నెలల బాలుడు నీటి ట్యాంక్ శవమై తేలటం కలకలం రేపింది. రాత్రి తమ వద్దే నిద్రించిన బాలుడు అర్ధరాత్రి 2 గంటల నుంచి కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆచూకి కోసం అంతా వెతికారు. అయినా ఎక్కడా బాలుడి ఆచూకి లభించక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాలుడి ఇంటికి చేరుకొని పరిశీలించారు. ఇల్లంతా గాలించారు. చివరికి నీటి ట్యాంక్ లో బాలుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే బాలుడి మృతికి కారణమైన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
బాలుడిని మేనమామ అత్త హత్యచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తమకు పిల్లలు పుట్టకపోవడంతో బాలుడిపై ద్వేషం పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. హత్యచేసి వాటర్ ట్యాంక్ లో వేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మరికొద్ది సేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.