Kiran Kumar Reddy : మోసగాడు చిక్కాడు.. తిరుపతిలో పట్టుకున్న తెలంగాణ పోలీసులు

అతడి చేతిలో పదుల సంఖ్యలో మహిళలు మోసపోయారు. అవమాన భారం భరించలేక ఒకరిద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Kiran Kumar Reddy : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అధికమవుతున్నాయి. గతంలో చోరీ చెయ్యాలంటే ఇంట్లోకి వచ్చి దోచుకునే వారు. కానీ ఇప్పుడు అలాంటివి అవసరం లేదు. మొత్తం ఆన్లైన్ వేదికంగానే జరిగిపోతున్నాయి. బ్యాంకు అకౌంట్ లో ఈ రోజు ఉన్న డబ్బు రేపటికల్లా మాయమవుతుంది. ఇలా సైబర్ నేరాల బారినపడి కోట్లు పోగుట్టుకున్నవారు చాలామందే ఉన్నారు.

Read More : Marijuana : గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ‘ప్రజాప్రతినిధి’

ఇక ఇప్పుడు కొత్తగా యాప్స్ ద్వారా కూడా మోసం చేయడం మొదలు పెట్టారు. కిలాడీ లేడీలు, జగత్ కంత్రిగాళ్ళు అమాయకులను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మ్యాట్రిమోని ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకొని డబ్బులు దండుకున్నాడు. ఒకరిద్దరిని కాదు.. అతడి చేతిలో మోసపోయిన వారి సంఖ్య భారీగానే ఉందని తెలుస్తోంది. ఇక ఈ మోసగాడి చేతిలో చిక్కి ఓ యువతి బలవన్మరణానికి కూడా పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి(29) మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ పెట్టాడు. దీంతో వరుడు కోసం వెతుకుతున్న వారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రొఫైల్ చూసి ఫోన్ చేసేవారు. ఆలా అమ్మాయిల ఫోన్ నంబర్లు తీసుకోని వారితో మాటలు కలిపి మెల్లిగా డబ్బులు గుంజేవాడూ.. ఆలా అనేక మందిని మోసం చేశాడు. ఈ మోసగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్టు 22న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అవమానం, ఒత్తిడి తట్టుకోలేక ఆ అభాగ్యరాలు సెప్టెంబర్‌ 19న ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Read More : Software Employee : భార్యతో గొడవ.. ఓ కారు, నాలుగు బైకులకు నిప్పుపెట్టిన ఐటీ ఉద్యోగి.

కిరణ్ కుమార్ రెడ్డి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తిరుపతిలో ఉన్నాడని తెలుసుకున్నారు. నలుగురు సభ్యుల బృందం తిరుపతి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ కి తరలించారు. కిరణ్ ఒక్కడేనా అతడి వెనక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై విచారణ చేపట్టి త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు