Marijuana : గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ‘ప్రజాప్రతినిధి’

ప్రజలకు సేవ చెయ్యాల్సిన సర్పంచ్ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.

Marijuana : గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ‘ప్రజాప్రతినిధి’

Marijuana

Marijuana : రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. అక్రమ మార్గాల ద్వారా గంజాయి సరిహద్దులు దాటుతోంది. దేశ వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఏపీలో పండిన గంజాయి అధికంగా లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ప్రజా ప్రతినిధి ఏకంగా గంజాయి వ్యాపారమే ప్రారంభించారు. అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

Read More : Balakrishna : బాలకృష్ణ కోసం నన్ను క్రూరంగా మార్చేశారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్‌ సుర్పం భగవంత్‌రావు, ఈస్‌గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్‌ లు గంజాయి సంప్లయ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్‌గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. వీరి వద్దనుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read More : Bathukamma 2021 : అక్టోబర్ 02 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ…మరింత కొత్తగా, 30 డిజైన్లు