TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఒకటో తేదీనే జీతాలు ?

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది.

TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఒకటో తేదీనే జీతాలు ?

Tsrtc

TSRTC Employees Salary : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే…దాదాపు మూడేళ్ల తర్వాత…ఒకటో తేదీనే జీతాలు అందనున్నాయి. పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ మొదటిగా దీనిపై దృష్టి కేంద్రీకరించారు. వారికి వేతనాలు ఎలా ఇవ్వాలనే దానిపై ఆరా తీశారు.

దీనిపై బ్యాంకులతో చర్చించారు. ప్రతి నెలా ఒకటో తేదీ లోపు రూ. 100 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వాలని..డిపోలో రోజువారీ టికెట్ కలెక్షన్ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని సజ్జనార్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందకొచ్చినట్లు..సజ్జనార్ చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. 2021, అక్టోబర్ 01వ తేదీన చెల్లింపు కోసం రూ. 100 కోట్లు చెల్లించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టికెట్ ఆదాయం నుంచి లేదా..ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచి..తిరిగి..ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించనున్నారు.

Read More : BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్..

తెలంగాణ ఆర్టీసీ..రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కలెక్షన్ లేక..ప్రజలు బస్సులు ఎక్కకపోతుండడంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఆర్టీసీకి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వ పలు చర్యలు తీసుకోంటోంది. అందులో భాగంగా..ఆర్టీసీ కార్గో సేవలను తీసుకొచ్చింది. దీనికి బాగానే ఆదరణ ఉంది. ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రోడ్లపై ఆర్టీసీ బస్సులు రయ్ రయ్ అంటూ తిరుగుతున్నాయి.

Read More :Mancherial : రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ గన్‌మెన్‌ మృతి

ప్రజలు కూడా మెల్లిమెల్లిగా ఎక్కడం ప్రారంభిస్తున్నారు. అయితే..జీతాలు చెల్లింపులో మాత్రం ఆలస్యం జరుగుతూ వచ్చింది. 2018 డిసెంబర్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు/కార్మికులు ప్రతి నెలా ఒకటో తేదీకి అటూ ఇటుగా వేతనాలు పొందుతూ వచ్చారు. కానీ సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో..జీతాలు ఇవ్వడమే గగనంగా మారింది. మరి..ఇప్పుడు ఇచ్చినట్లు..ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తారా ? లేదా ? అనేది చూడాలి.