Girl Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో విచారణ వేగవంతం

ఏ-5 మైనర్ నిందితుడిని కాసేపట్లో పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మైనర్ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారు.

Police

girl gang rape case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఏ-5 మైనర్ నిందితుడిని కాసేపట్లో పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మైనర్ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారు.

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాఫ్తులో పోలీసులు పురోగతి సాధించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ కాగా, మరొకరు మైనర్. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌

అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసులో ఏ-2 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అమ్నేషియా పబ్ ను పోలీసులు క్లోజ్ చేయించారు.