MIM Corporator Enquiry : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఎంఐఎం కార్పొరేటర్‌ను విచారించనున్న పోలీసులు

ఓ ఎంఐఎం కార్పొరేటర్ ను విచారించనున్నారు. కారులో మొయినాబాద్ వరకు వెళ్లి, నిందితులకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.(MIM Corporator Enquiry)

MIM Corporator Enquiry : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఓ ఎంఐఎం కార్పొరేటర్ ను విచారించనున్నారు.

సోమవారం విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆ కార్పొరేటర్ తో చెప్పారు. దీంతో సదురు కార్పొరేటర్ రేపు విచారణకు హాజరుకానున్నారు. ఈ కార్పొరేటర్ గతంలో హైదరాబాద్ మేయర్ గా సేవలందించాడు. రేప్ కేసులో నిందితులకు సహకారం అందించారని కార్పొరేటర్ పై ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్.. కారులో మొయినాబాద్ వరకు వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు.(MIM Corporator)

JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. ఆ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ తప్పదా?

గత నెల 28వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న అమ్నీషియా పబ్‌కు.. ఇద్దరు యువకులతో కలిసి మైనర్ బాలిక పార్టీకి వెళ్లింది. కాసేపటి తర్వాత ఆమెను కారులోకి ఎక్కించుకుని ఆరుగురు యువకులు బయటకు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లాక.. ఆమెను మరో వాహనంలోకి మార్చారు. గంటన్నర తర్వాత బాలికను తిరిగి పబ్ దగ్గర వదిలారు. ఆ తర్వాత బాలిక ఇంటికి చేరుకుంది.

బాలిక మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. తనపై లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు చెప్పింది. షాక్ తిన్న తల్లిదండ్రులు.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని కారులో బయటకు తీసుకెళ్లిన యువకులు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో తెలిపారు.

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కీలక విషయాలను గుర్తించారు. బాలికను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారని మీడియాలో కథనాలు రావడం కలకలం రేపింది.

ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఇక ఈ కేసు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ ఘటనలో ప్రజాప్రతినిధుల కుమారులు ఉండటం వల్ల పోలీసులు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులను తప్పించాలని చూస్తున్నారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు ఆరోపించారు.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

మే 28న అమ్నేషియా పబ్ లో రాష్ట్ర మంత్రి మనవడు బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. స్వయంగా మంత్రి పీఏ ఆ పబ్‌ బుక్‌ చేశారని ఆరోపించారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఎఫ్ఐఆర్‌లో కారు నంబర్లను నమోదు చేశారు. రేప్‌ చేసింది కార్లా?’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు కూడా నిందితుల్లో ఉన్నారని.. వాళ్లు వాడిన కార్లు రెండు పార్టీల నేతల బంధువుల పేర్లతో ఉన్నాయని ఆయన అన్నారు.(MIM Corporator Enquiry)

ట్రెండింగ్ వార్తలు