Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

Gang Rape

gang rape : హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 4 పోలీస్‌ బృందాలను రంగంలోకి దింపారు. బాలికపై అత్యాచారం తర్వాత నిందితులు గోవా పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు గోవాలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఒక బృందాన్ని గోవాకు పంపారు. బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ కేసులో.. తెరపైకి వచ్చిన ఓ ప్రజాప్రతినిధి కొడుకుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదంటున్నారు పోలీసులు. ఎవరి ప్రమేయం ఉన్నా విచారణలో తేలుతుందని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

పబ్‌లో పార్టీకి వెళ్లిన తనపై కొందరు యువకులు అత్యాచారం చేశారంటూ బాలిక స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మే 28న సాయంత్రం 5 గంటలను తనను.. బలవంతంగా కారులతో తీసుకెళ్లారంటోంది బాధితురాలు. పబ్‌కు వెళ్లిన తనను కారులో బలవంతంగా తీసుకెళ్లారంటోంది బాలిక. బెంజ్‌ కారులో తనపై అత్యాచారం చేశారంటూ బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచారం తర్వాత తనను పబ్‌ వద్ద వదిలిపెట్టి.. యువకులు వెళ్లిపోయారని చెబుతోంది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పానని.. మెడ దగ్గర తీవ్రగాయాలయ్యాయని బాధితురాలు వాపోతోంది. ఫ్రెండ్స్‌ పిలిచారంటూ.. బాలిక జూబ్లీహిల్స్‌లోని అమ్నేసియా పబ్‌కు వెళ్లింది. సూరజ్‌, హదీ అక్కడ బాలికను రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడ మరికొంతమంది యువకులు పార్టీలో జాయిన్‌ అయ్యారు.

Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

పార్టీ అయ్యాక.. బాలికపై కన్నేసిన యువకులు.. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సుమారు రెండు గంటల పాటు.. కారులోనే బాలికను చిత్రహింసలకు గురిచేశారు. బాలికను కొడుతూ.. లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ తీసుకొచ్చి.. పబ్‌ దగ్గరే వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లినా.. ఈ విషయాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. బాలిక ముభావంగా ఉండటం.. మెడమీద గాయాలు ఉండటంతో.. ఆమె పేరెంట్స్ ఏమైందంటూ ఆరా తీశారు. బాలిక విషయం చెప్పడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మే 28న నా కుమార్తె జూబ్లీహిల్స్ రోడ్‌ నెం.36లోని అమ్నేసియా అండ్‌ ఇన్సోమియా పబ్‌లో పార్టీకి వెళ్లింది. మా అమ్మాయిని ఆమె ఫ్రెండ్స్‌ సూరజ్‌, హదీ తీసుకెళ్లారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పబ్‌ నుంచి బయటకు వచ్చిన నా కూతురును.. కొందరు యువకులు TS09FL6460 నెంబర్‌ ఉన్న రెడ్‌ కలర్‌ మెర్సిడైజ్‌, T/R నెంబర్‌తో ఉన్న ఇన్నోవా కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారు. నా కూతురుతో వారు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె శరీరంపై గాయాలు కూడా చేశారు. అప్పటి నుంచి నా కూతురు తీవ్ర షాక్‌లో ఉంది. జరిగిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయింది. ఈ కేసులో విచారణ జరిపి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కోరుతున్నారు.