TS Aasara Pensions: కొత్తగా ‘ఆసరా పింఛన్ల’కు అప్లై చేసుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఆరోజే డబ్బులు వేస్తారట

స్వాతంత్ర్య దినోత్సవం శుభసందర్భంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఆసరా పెన్షన్లు(Aasara Pensions) అందజేస్తామని మంత్రి ప్రకటించారు.

ponguleti srinivas reddy announces new aasara pensions from august 15

  • కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ
  • ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభం
  • భూ భారతి డిజిటల్ పత్రాలు

Telangana Aasara Pensions: తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ గుదిమళ్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

Also Read – AP Government: నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రతీ కుటుంబానికి రూ.25000.. రేపే అకౌంట్స్ లో జమ

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై స్పష్టత:

రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం శుభసందర్భంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఆసరా పెన్షన్లు (Aasara Pensions)అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలకు నెలకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున ఆర్థిక సాయం అందుతోందని గుర్తుచేశారు. వీటితో పాటు రెండు, మూడు రోజుల్లోనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను సైతం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

భూ సమస్యల పరిష్కారం, సాగునీటి హామీ:

సమగ్ర భూ సర్వే చేపట్టి ‘భూ భారతి’ ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ మ్యాప్‌తో సహా హక్కు పత్రాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనర్హుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. వచ్చే మొదటి పంటకే రైతుల పొలాలకు సాగునీరు అందిస్తామని పేర్కొంటూ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.