Ponguleti – Jupalli : అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం: పొంగులేటి.. Updates In Telugu

ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఉన్నారు.

Ponguleti Srinivas Reddy, Jupally Krishna Rao

Ponguleti – Jupalli : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ (Congress) అగ్రనేతల సమక్షంలో జులై మొదటి వారంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని వారిద్దరు కలిశారు. ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్ ను టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలోనే మరింత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని చెప్పారు.

ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి ఉన్నారు.

Manik Rao Thackeray : బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు : మాణిక్ రావు థాక్రే

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 26 Jun 2023 06:24 PM (IST)

    భారీగా డబ్బు ఖర్చు..

    ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. భారీగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. తాము అప్పట్లో పదువులు వదులుకుని ఉద్యమంలో పాల్గొన్నామని తెలంగాణ వచ్చాక ప్రజల బతుకులు బాగుపడతాయనుకున్నామని తెలిపారు. కేసీఆర్ వల్ల ప్రజల కలలు నెరవేరలేదని చెప్పారు.

  • 26 Jun 2023 05:42 PM (IST)

    కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారు: జూపల్లి

    ఎప్పటికప్పుడు కొత్త పథకాల పేర్లు చెబుతూ సీఎం కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ పాలన అంతా బోగస్ పథకాలు, బోగస్ మాటలతో కొనసాగుతోందని చెప్పారు.

  • 26 Jun 2023 05:12 PM (IST)

    అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం..

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ అనుకున్న అభివృద్ధి జరగలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలన బాగోలేదని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారో అవి జరగలేదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి వల్ల ప్రజాలకు దక్కాల్సినవి దక్కడం లేదని అన్నారు. అనేక మోసపూరిత హామీలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

  • 26 Jun 2023 04:11 PM (IST)

    రాహుల్ కీలక సూచనలు

    రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశం ముగిసింది. జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని సూచించారు.

  • 26 Jun 2023 04:03 PM (IST)

    ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు వీరే..

    జూపల్లి కృష్ణారావు
    గుర్నాథ్ రెడ్డి
    కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
    తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి
    మేఘారెడ్డి తుడి
    కూర అన్న కిష్టప్ప
    ముద్దప్పా దేశ్ ముఖ్
    జూపల్లి అరుణ్
    సూర్య ప్రతాప్ గౌడ్
    కల్యాణ్ కుమార్ కొత్త
    దండు నర్సింహ
    సానే కిచ్చా రెడ్డి
    గోపిశెట్టి శ్రీధర్
    సూర్య

    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    కోరం కారకయ్య
    పాయం వెంకటేశ్వర్లు
    మువ్వా విజయ బేబీ
    తెల్లం వెంకటరావు
    పిడమర్తి రవి
    జారే ఆది నారాయణ
    బానోత్ విజయ.
    తెల్లూరి బ్రహ్మయ్య
    మద్దినేరి స్వర్ణ కుమారి
    బొర్రా రాజశేఖర్
    కోట రాంబాబు
    ఊకంటి గోపాల్ రావు
    డా.రాజా రమేశ్
    జూపల్లి రమేశ్
    అయిలూరి వెంకటేశ్వర రెడ్డి
    హనుమాండ్ల జాస్ని రెడ్డి
    రఘునాథ్ యాదవ్
    రాఘవేంద్ర రెడ్డి
    కేతా మనోహర్ రెడ్డి
    సుతగాని జైపాల్

  • 26 Jun 2023 03:47 PM (IST)

    జులై తొలి వారంలో కాంగ్రెస్‌లోకి..

    జులై తొలి వారంలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెలా నర్సారెడ్డి, ఇతర నేతలు గుర్నాథ్ రెడ్డి, ముద్దప్పా దేశ్ ముఖ్, కిష్టప్ప కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • 26 Jun 2023 03:42 PM (IST)

    మీడియాతో మాట్లాడనున్న పొంగులేటి, జూపల్లి

    పొంగులేటి, జూపల్లిని రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. మరి కాసేపట్లో పొంగులేటి, జూపల్లి మీడియాతో మాట్లాడనున్నారు.

  • 26 Jun 2023 03:38 PM (IST)

    రాహుల్‌తో భేటీ

    ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిశారు.

  • 26 Jun 2023 03:18 PM (IST)

    భారీగా చేరికలు

    మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ లో 150 మంది నేతలు చేరనున్నారు. వారందరితో రాహుల్ గాంధీ మాట్లాడతారు.

  • 26 Jun 2023 03:16 PM (IST)

    రాహుల్ గాంధీని కలవనున్న నేతలు వీరే..

    పొంగులేటి, జూపల్లి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి(నిజామాబాద్), గుర్నాథ్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) ముద్దప్పా దేశ్ ముఖ్, కిష్టప్ప, కుచుకుల్ల దామోదర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ).