Ponnala Lakshmaiah : పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య

రాజీనామా ప్రకటిస్తు లేఖ చూపిస్తు భోవాద్వేగానికి గురయ్యారు పొన్నాల లక్ష్మయ్య. పార్టీలో ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొన్నానని..ఇక భరించలేక రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తంచేశారు.

Ponnala Lakshmaiah Resigned Congress

Ponnala Lakshmaiah : కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేను పంపించారు. ఈ సందర్భంగా పొన్నాల తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతు.. రాజీనామా ప్రకటిస్తు లేఖ చూపిస్తు భోవాద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొన్నానని..ఇక భరించలేక రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తంచేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది..పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా..కానీ పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అంటూ మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ మంచి గురించి చెబుతుంటే వినేవారే లేరు..కొంతమందికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ వాపోయారు. వరుసగా మూడుసార్లు గెలిచాను..12 ఏళ్లు మంత్రిగా పనిచేశాను..పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్న నేను ఇన్ని అవమానాలు పడలేనని అందుకే రాజీనామా చేశాను అంటూ వివరించారు.

Ponnala Lakshmaiah: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ‘ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నాయకుడైన మీరు పార్టీకి రాజీనామా చేశారు..మీ రాజకీయ భవిష్యత్తు ఏంటీ..?’ అని ప్రశ్నించగా పొన్నాల సమాధానమిస్తు.. నేను నా రాజకీయ భవిష్యత్తు కోసం ఏమాత్రం ఆలోచించలేదని పదవుల కోసం రాజీనామా చేయలేదని అవమానాలు భరించలేకే రాజీనామా చేశాను అని తెలిపారు. ‘‘పదవి కోసం అయితే పార్టీలోంచి వెళ్లనక్కరలేదని..గతంలో తాను ఓడిన సందర్బంలో దిగ్విజయ్ సింగ్ తనకు ఫోన్ చేసి ఎమ్మెల్సీ తీసుకోమని సూచించారని కానీ తాను దానికి అంగీకరించలేదని..పదవి కోసమే అయితే అది తీసుకునేవాడిని కదా’’ అని చెప్పుకొచ్చారు.

దీంతో మీడియా ప్రతినిధులు మరో ప్రశ్న వేస్తు..‘జనగామ టికెట్ ఇవ్వనందుకే రాజీనామా చేశారా..?బీఆర్ఎస్ లో చేరుతున్నారా..? అని ప్రశ్నించగా పొన్నాల మండిపడ్డారు. ‘అంటే బీఆర్ఎస్ లో చేరమని మీరు చెబుతున్నారా..మీరు నాకు సలహా ఇస్తున్నారా..?మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా..జనగామ టికెట్ ఆశించిన పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు కూడా జోరందుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు