Ponnala Lakshmaiah : కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. రైతులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆయన మండిపడ్డారు. గోదావరి జలాల వినియోగంపై అవగాహన లేనిది ఎవరికో ప్రజలకు తెలుసు అని అన్నారు. మంత్రులు అనుభవరాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ బిజీగా ఉన్నారు.. అందుకే మంత్రులకు మాట్లాడే అవకాశం వచ్చిందని విమర్శించారు. నిపుణులు చెప్పారని కాళేశ్వరంపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ చెప్పకముందు నీటిని ఎందుకు ఎత్తిపోయలేదు? అని ఆయన ప్రశ్నించారు.
”దేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా? కాంగ్రెస్ నేతలవి అవివేకాపు ప్రకటనలు. కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు ఎక్కడికి వెళ్తాయో చూద్దాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు అందించే ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక్కడ నిపుణుల సలహాలు అవసరం లేదా?” అని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య.
”ఇంత విపత్కర పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ పరిస్థితిలో మాకున్న నీళ్లను ఇవ్వండి అని అడిగేందుకు ధైర్యం లేని ఈ మనుషులు పరిపాలన చేస్తారా? రైతుల పక్షాన నిలబడతారా? కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ లో అడగొచ్చు కదా? 5 టీంఎసీలో, 10 టీఎంసీలో వచ్చే ఏడాది వాడుకోండి అని అడిగారా? వాళ్లకు తాగునీరు మనకు ఇవ్వమని అడగటం లేదు. రైతుల పరిస్థితి చూసి, జలాశయాల్లో తక్కువ నీరు ఉన్న సమయంలో ఆదుకోవడానికి చేసే కార్యక్రమం ముఖ్యమా? లేకపోతే దిక్కుమాలిన ముచ్చట్లు మాట్లాడటం ముఖ్యమా?” అని పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు.
వాసుదేవ రెడ్డి, బీఆర్ఎస్ నేత
ఎంపీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ మరోసారి రెడీ అవుతోంది. తెలంగాణ మ్యానిఫెస్టోలో ప్రత్యేకంగా కొన్ని అంశాలు పెట్టారు. దళితబంధు 12 లక్షలు ఎటుపోయాయి? మళ్ళీ కొత్తగా పెట్టారు. రుణమాఫీ, రైతుబంధు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీలు అమలుకు ఎందుకు నోచుకోవడం లేదు?
Also Read : అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ అవుతుందా? చేవెళ్ల ఎంపీ స్థానంలో ముక్కోణపు పోరు