×
Ad

తెలంగాణలో కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్‌పై పీకే శపథం నెరవేరేనా?

గతంలో బిహార్ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ‘మీ సొంత గడ్డ మీద మిమ్మల్ని ఓడిస్తా’ అని శపథం చేశారు.

Kavitha Kalvakuntla, Prashant Kishor (Image Credit To Original Source)

  • తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధం
  • ప్రశాంత్ కిశోర్‌తో సమావేశాలు
  • రేవంత్‌ను ఓడిస్తానని గతంలో పీకే శపథం

Kavitha Kalvakuntla: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీకి సంబంధించి ఆమె స్ట్రాటజిస్టులను కూడా రంగంలోకి దింపుతున్నారు. కల్వకుంట్ల కవిత, ఐప్యాక్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు.

ఇప్పటికే పలుమార్లు పీకే హైదరాబాద్ లో పర్యటించి కవితతో చర్చించారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా సుమారు నాలుగైదు రోజుల పాటు కవితతో చాలా అంశాలు చర్చించినట్టు సమాచారం.

పీకేను స్ట్రాటజిస్టుగా నియమించుకుని ఆమె ముందకు వెళ్లాలని కవిత ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో విబేధాలతో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా, తెలంగాణ ప్రజల కోసంపార్టీ పెట్టాలని ఆమె డిసైడ్ అయ్యారు.

Also Read: ఇంటి నుంచి తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర షురూ.. చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజల కోసం పెట్టే పార్టీ ఎలా ఉండాలి? ప్రజలు ఆ పార్టీ తమదే అని ఫీలయ్యేలా ఉండాలంటే ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజల కోణంలో ఎలా పనిచేయాలి? ఇలాంటి అంశాలపై పీకేతో కవిత సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశాలపై సుమారు 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఇప్పటికే ఆయా అంశాలపై అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పుడు పీకే రంగంలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది.

జగన్ విషయంలో సక్సెస్ అయిన పీకే ఆ తర్వాత పెద్దగా విజయం సాధించలేదు. సాక్షాత్తూ తన సొంత రాష్ట్రం బిహార్ లో సొంతంగా జన సురాజ్ పార్టీ పెట్టి ఘోరంగా విఫలమయ్యారు. అయితే, ఆయన బిజినెస్ కు మాత్రం ఢోకా లేకుండా పోయింది.

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి ఐప్యాక్ టీమ్ పనిచేస్తోంది. తమిళనాడులో విజయ్ సారధ్యంలోని టీవీకే పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ కవిత పార్టీకి సేవలు అందించేందుకు ఆయన సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

పీకే శపథం ఇదే..
గతంలో బిహార్ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు. ‘మీ సొంత గడ్డ మీద మిమ్మల్ని ఓడిస్తా’ అని శపథం చేశారు. తెలంగాణ డీఎన్ఏ కంటే బిహార్ డీఎన్ఏ చాలా చెత్తగా ఉంటుందనేలా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు పీకే కౌంటర్ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ కూడా రేవంత్ ను రక్షించలేడు. వచ్చే ఎన్నికల్లో మేం ఆయన్ను ఓడించడం ఖాయం’ అని పీకే సవాల్ చేశారు.