Sangareddy : టెట్ పరీక్ష రాయడానికి వెళ్లి గర్భిణీ మృతి

పరీక్షా సమయం దగ్గరపడుతున్న ఆత్రుతతో గేట్ వద్ద నుంచి పరీక్ష హాల్ వరకు అతి వేగంగా వెళ్లారు. తనకు కేటాయించిన కుర్చీపై కూర్చుకున్న కొద్ది సేపటికే ఆమె తీవ్ అస్వస్థతకు గురయ్యారు.

pregnant woman died

Pregnant Woman Died In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. టెట్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ గర్భిణీ మృతి చెందారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక గురుకుల పాఠశాలలో టెట్ రాయడానికి వచ్చిన గర్భిణీ హఠాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందిరానగర్ కు చెందిన రాధిక (32) ఎనిమిది నెలల గర్భిణీ.

ఈ నేపథ్యంలో శుక్రవారం భర్త అరుణ్ బాబు, తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షా సమయం దగ్గరపడుతున్న ఆత్రుతతో గేట్ వద్ద నుంచి పరీక్ష హాల్ వరకు అతి వేగంగా వెళ్లారు. తనకు కేటాయించిన కుర్చీపై కూర్చుకున్న కొద్ది సేపటికే ఆమె తీవ్ అస్వస్థతకు గురయ్యారు.

Man Kill : ఢిల్లీలో దారుణం.. చిన్న గొడవకు కత్తులతో పొడిచి వ్యక్తి హత్య

గురుకుల సిబ్బంది ఆమె బీపీని పరీక్షించగా బాగా పెరిగింది. దీంతో హుటాహుటిన ఆమెను ఓ కానిస్టేబుల్ కారులో పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.

రాధికకు ఇప్పటికే ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. త్వరలో మూడో కాన్పు కావాల్సి ఉంది. అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.