Ram Nath Kovind : హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Kovind

President Ram Nath Kovind : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రామానుజ స్వర్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజచార్యుల బంగారు విగ్రహం ఆవిష్కృతం కానుంది.

ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఆవిష్కరించనున్నారు.

Dinosaur : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్‌నాథ్ కోవింద్ దాదాపు రెండు గంటలపాటు గడపనున్నారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.

రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మహా పూర్ణాహుతితో పాటు భగవత్‌ రామానుజుల స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట, కుంభాబిషేకం నిర్వహించనున్నట్టు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ తెలిపారు. అలాగే రేపు సాయంత్రం 108 దివ్యదేశాల దేవతలకు శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.