Bus Accident
Bus Accident : హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు)పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 15మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలుకాగా.. వారిని చికిత్స నిమిత్తం డీఆర్డీవో అపోలో, హయత్ నగర్ ఆస్పత్రులకు తరలించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మలుపులో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.