కేసీఆర్ సలహా పాటించిన కాంగ్రెస్: ప్రొఫెసర్ నాగేశ్వర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై 10టీవీ చర్చాకార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Prof K Nageshwar opinion on telangana congress manifesto

కేసీఆర్ ఇచ్చిన సలహాను కాంగ్రెస్ పార్టీ బాగా పాటిస్తోందని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై 10టీవీ చర్చాకార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాము విఫలమైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మానేసి మీరేం చేస్తారో చెప్పాలని కేసీఆర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారని, అదే సలహాను ఇప్పుడు కాంగ్రెస్ పాటించిందని వివరించారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. రుణమాఫీ పూర్తిగా మాఫీగా కాలేదన్న భావన రైతాంగంలో ఉందని, దాన్ని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో అడ్రస్ చేసిందని వ్యాఖ్యానించారు.

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అన్ని పార్టీలకు సవాళ్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హామీల అమలు సాధ్యమా అనే ప్రశ్న అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు. అయితే ఆయా పార్టీలు ఇచ్చిన హామీలపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కౌలుదారులకు ఇచ్చిన హామీ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వంమైనా కొన్ని హామీలు చేయలేదని, కొన్నిసార్లు చెప్పనవి కూడా అమలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.