Gaddam Prasad Kumar
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం సభలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికను ప్రకటించారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్త స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
కాగా..తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ పదవి కోసం కేవలం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.