Punjab CM Bhagwant Mann appreciated the Telangana irrigation projects
Punjab CM Bhagwant Mann : తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాములను కూడా పరిశీలించారు భగవంత్ మాన్. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద కలియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్ సీఎం ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ..తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని తెలిపారు.
అద్భుతమైన నిర్మాణంతో పంట పొలాలకు నీటిని అందించేలా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మోడల్స్ ను పంజాబ్ లో కూడా అమలు చేస్తామన్నారు. తెలంగాణలో కాలువల ద్వారా నీటిని మళ్లించి పంటలు పండిస్తున్నారని..కానీ పంజాబ్ లో మాత్రం ఇలా ఉండవని..మా రాష్ట్రంలో బావులు, బోర్లతోనే పంటలు పండుతాయని తెలిపారు. కాలువల ద్వారా పంటలు పండించే విధానాన్ని కూడా పంజాబ్ లో అమలు చేస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని..కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారని ఇటువంటి విధానం సమసిపోతే రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు.తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కొండపోచమ్మ సాగర్ సంప్ ను పనితీరును..అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తీరుతో పాటు మిషన్ భగీరథ గురించి కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రంజత్ కుమార్ సీఎం భగవంత్ మాన్ కు వివరించారు.