Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో ‘న్యాయ్ పత్రా’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేలాది మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చెప్పారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదిలో పడేశాని అన్నారు. తెలంగాణ సర్కార్ విచారణ మొదలు పెట్టిందని, అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. కేసీఆర్ లాగానే.. మోదీ కూడా అదే చేశారని తెలిపారు.
ప్రపంచంలోనే పెద్ద స్కామ్
ఎలక్ట్రోరల్ బాండ్స్ ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అని రాహుల్ గాంధీ చెప్పారు. సీబీఐతో బెదిరించి అదే కంపెనీలతో ఎలక్ట్రోరల్ బాండ్స్ తో బీజేపీ వసూల్ చేసిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించామని, రేపు బీజేపీని ఓడిస్తామని తెలిపారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని తెలిపారు. తెలంగాణ స్వప్నాన్ని కేసీఆర్ దెబ్బకొట్టారని అన్నారు. మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనా కంటే పెద్ద బ్రాండ్‌గా మారాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అరు గ్యారంటీలను ఇదే వేదికగా ఆనాడు ప్రకటించామని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. దేశప్రజల వాణి మా మ్యానిఫెస్టో అని చెప్పారు. వారి కోరిక, అభిప్రాయాలే ఈ మ్యానిఫెస్టో అని చెప్పారు. ఐదు గ్యారంటీలు మానిఫెస్టోకు ఆత్మ అని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు అన్యాయం జరిగిందని, వారు నిరుపేదలుగా మారారని అన్నారు.
నారీ న్యాయ పథకంలో భాగంగా తాము ప్రతిమహిళకు ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. బడా వ్యాపారులకు మోదీ 16 లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశారని అన్నారు. తాము కిసాన్ న్యాయ్ ద్వారా రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం తెస్తామని చెప్పారు. తెలంగాణ మాదిరి దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని తెలిపారు.
మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ, విత్‌డ్రా చేస్తూ ఉన్నారా?