Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్

Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రం ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు.

Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రం ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకున్నామని, రైతులు, పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని భావించామని చెప్పారు. కానీ, తెలంగాణలో ఉన్నది సీఎం కాదు.. రాజు అన్నారు. తనకు ఏమనిపిస్తే అదే చేస్తారని రాహుల్ విమర్శించారు. చత్తీస్ గఢ్ లో రూ.2,500 క్వింటా ధాన్యం కొంటున్నామని రాహుల్ చెప్పారు. కానీ, తెలంగాణ సీఎం రైతుల గోడు వినరని రాహుల్ విమర్శించారు.

అధికారంలోకి వస్తే.. హామీలన్నీ నిలబెట్టుకుంటాం :
తెలంగాణ రైతుకు మద్దతు ధర దొరకడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, మేమిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని రాహుల్ భరోసా ఇచ్చారు. ఇది డిక్లరేషన్ కాదు.. రైతులకు కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ అన్నారు.

తెలంగాణ అంత సులువుగా ఏర్పడలేదన్నారు. ఈ రాష్ట్రం ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడలేదని, ఇది తెలంగాణ ప్రజల కలగా రాహుల్ పేర్కొన్నారు. అసలు తెలంగాణ ప్రజలు కన్న కల ఏమైందని రాహుల్ ప్రశ్నించారు. ఒక్క కుటుంబానికి మాత్రమే లాభం కలిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పాలన్నారు. యువకుల కలలతోనే తెలంగాణ ఏర్పడిందని రాహుల్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందిందా? రాహుల్ సూటిగా ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు ఎవరు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ సాధించేందుకు యువకులు రక్తం చిందించారని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read Also : Rahul Gandhi : టీఆర్ఎస్‌తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు