Rahul Gandhi : టీఆర్ఎస్‌తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!

Rahul Gandhi : టీఆర్ఎస్ తో పోత్తుపై కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తెలంగాణకు ద్రోహం చేసినవారితో ఎలాంటి పొత్తు ఉండదన్నారు.

Rahul Gandhi : టీఆర్ఎస్ తో పోత్తుపై కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తెలంగాణకు ద్రోహం చేసినవారితో ఎలాంటి పొత్తు ఉండదన్నారు. తెలంగాణ ప్రజల కలలను చిధ్రం చేసి వారితో ఎలాంటి పొత్తులు ఉండవని రాహుల్ స్పష్టం చేశారు. పొత్తుల ప్రతిపాదన తెచ్చేవారిని పార్టీ నుంచి తరిమేస్తామన్నారు. టీఆర్ఎస్ ను ఓడిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల కలలను భగ్నం చేసిన వారిని క్షమించేది లేదన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేయని నేతలెవరూ మాకొద్దని రాహుల్ తెలిపారు.

రైతు పక్షాన పోరాడి, కష్టపడి పనిచేసిన నేతలకే టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీతో పొత్తు కొరుకునే వాళ్లు ఆ పార్టీల్లోకి వెళ్లొచ్చన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని డైరెక్టుగా ఏర్పాటు చేయలేమని బీజేపీకి తెలుసునని రాహుల్ అన్నారు.

అందుకే రిమోట్ కంట్రోల్‌తో ఇక్కడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. అవినీతిపై కేంద్రం ఎలాంటి విచారణ చేయించడం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాహుల్ కోరారు. తెలంగాణ కన్న కలలను నిజం చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.

ఇది తెలంగాణ ప్రజల కల : 
తెలంగాణ అంత సులువుగా ఏర్పడలేదన్నారు. ఈ రాష్ట్రం ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడలేదని, ఇది తెలంగాణ ప్రజల కలగా రాహుల్ పేర్కొన్నారు. అసలు తెలంగాణ ప్రజలు కన్న కల ఏమైందని రాహుల్ ప్రశ్నించారు. ఒక్క కుటుంబానికి మాత్రమే లాభం కలిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పాలన్నారు. యువకుల కలలతోనే తెలంగాణ ఏర్పడిందని రాహుల్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందిందా? రాహుల్ సూటిగా ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు ఎవరు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ సాధించేందుకు యువకులు రక్తం చిందించారని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read Also : Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు