Telangana Rain : తెలంగాణకు వర్ష సూచన, మూడు రోజులు వానలు

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rain Alert For Telangana : తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చంది. చాలా జిల్లాల్లో వానలు పడతాయని.. ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. నుంచి 2.1 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందంది. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంల్లోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, అనంతపురంలో వానలు పడుతున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఈ నెల 4న తెలంగాణను తాకాయి. దీంతో తొలకరి వర్షాలు కురిశాయి. అయితే.. ఆ తర్వాత నుంచి వర్షాలు జాడే లేకుండాపోయంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల్లో కదలికలు లేక వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువే ఉష్ణోగ్రత నమోదైంది. వానల కోసం సాధారణ ప్రజలతో పాటు అన్నదాతలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు