వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో ఈ 9 జిల్లాలకు అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ లో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం..

Heavy rains

Heavy Rains: తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లోనూ శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. అయితే, మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Mlc Kavitha: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కవిత.. చిన్న కుమారుడితో కలిసి తండ్రి వద్దకు.. ఇవాళ రాత్రి అమెరికాకు పయనం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఇవాళ జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే, మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురుస్తుందని, సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలాఉంటే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా టేక్మల్ లో 17సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాల్లోని అల్లాదుర్గ్‌లో 14, కామారెడ్డి జిల్లా మద్నూరులో, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది.