×
Ad

Rain Alert : వానలే వానలు.. ఈ జిల్లాల్లో రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణంలో అనూహ్యం మార్పులు.. జాగ్రత్తలు తీసుకోండి..

Rain Alert Telangana : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు,,

Rain Alert Telangana

Rain Alert Telangana : తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (Rain Alert Telangana) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండ్రోజులు వర్షాలు పడుతాయని.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Also Read: మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?

ఇవాళ తెలంగాణలో నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

మరోవైపు తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఒకవైపు వర్షాలు కొనసాగుతుండగా.. మరోవైపు చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 21.6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.