మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?

కాలుష్య నియంత్రణ బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా ఉన్నారు.

మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?

Konda Surekha

Updated On : October 14, 2025 / 10:49 PM IST

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేసింది. కాలుష్య నియంత్రణ బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా ఉన్నారు. పరిపాలన కారణాలతో ఆయనను తొలగిస్తున్నట్లు పీసీబీ ఉత్తర్వులో పేర్కొంది.

అయితే, తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య వివాదం రాజుకున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం: అటు అక్క, ఇటు తమ్ముడు.. ఓటర్లు ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా?

కాగా.. మేడారం ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో ఇటీవల కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా దంపతులు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.71కోట్ల విలువైన టెండర్ల విషయంలో కొండా దంపతులు ఆరోపణలు చేస్తున్నారు. ఆ టెండర్లను పొంగులేటి తన అనచురులకు ఇప్పించుకున్నారని వారు అంటున్నారు.