Rainfall alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడడంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

heavy rain alert

Rainfall alert for Telangana: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడడంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

నిన్న తెలంగాణలోని 17 మండలాల్లో చిరుజల్లులు కురిశాయని తెలిపారు. మరోవైపు, పలు ప్రాంతాల్లో సెప్టెంబరు 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆలా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Amala Akkineni : నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి అందుకే సినిమాలు చేయట్లేదు..