Rain Alert: తెలంగాణ‌లో మరో 4 రోజుల‌ పాటు వ‌ర్షాలు.. భారీ వ‌ర్షాలు ఏఏ జిల్లాల్లో అంటే..

తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. మ‌రికొద్ది గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే తెలంగాణ వ్యాప్తంగా మ‌రో నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Alert: తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. మ‌రికొద్ది గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే తెలంగాణ వ్యాప్తంగా మ‌రో నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

వాతావ‌ర‌ణ శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌రికొద్ది గంట‌ల్లో హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగార‌డ్డి, యాదాద్రి, సూర్యాపేట‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ లో రాత్రివేళ‌లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. శుక్ర‌వారం ఉద‌యం నుంచి హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో ర‌హ‌దారుల‌పైకి వ‌ర్ష‌పు నీరు చేరి వాహ‌న‌దారులు రాక‌పోక‌లు సాగించేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు.

భారీ వ‌ర్షం కార‌ణంగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారుల‌కు, ఉద్యోగుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. వ‌ర్షం త‌గ్గిన వెంట‌నే త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లేందుకు బ‌య‌ట‌కు రావొద్ద‌ని, వ‌ర్షం త‌గ్గిన గంట త‌రువాత రోడ్ల‌పైకి రావాల‌ని సూచించారు. వ‌ర్షం ప‌డిన త‌రువాత‌ ర‌హ‌దారుల‌పై భారీగా నీరు చేరుతుంద‌ని, దీని వ‌ల్ల వాహ‌న‌దారులు మ్యాన్ హోల్స్ గుర్తించ‌లేక ప్ర‌మాదాల భారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అదేవిధంగా ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని సూచించారు.

ఇదిలాఉంటే మ‌రో నాలుగు రోజుల పాటు తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. రేపు (జూలై 23) ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆషిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్లుండి (జూలై24) ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆషిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 25, 26 తేదీల్లో కూడా ఆయా జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు ఉంటేనే బ‌య‌ట‌కు రావాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు