Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ సహా పలు ప్రాంతాల్ల భారీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా పెరిగింది.

Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

Rain

Heavy rain : తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా పెరిగింది. లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లిలో వర్షం కురుస్తోంది. నగరం మొత్తం మేఘావృతమైంది. ఇక మేడ్చల్‌ జిల్లాలోని కాప్రా, ఏఎస్‌రావ్‌నగర్‌, ఈసీఐఎల్‌ చౌరాస్తా, కుషాయిగూడ, హెచ్‌.బి కాలనీ, చర్లపల్లిలో వాన కుమ్మేస్తోంది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని చెప్పింది. ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది.

Poisonous Snakes : మంచిర్యాలలో విష సర్పాల కలకలం..వర్షాలు, వరదలకు కొట్టుకొచ్చిన పాములు

కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ సహా పలు ప్రాంతాల్ల భారీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా పెరిగింది.

లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లిలో వర్షం పడింది. చర్లపల్లిలో అత్యధికంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉప్పల్‌, శేరిలింగంపల్లిలో 13 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అల్వాల్‌, అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్‌, సరూర్‌నగర్‌, బహదూర్‌పుర, బండ్లగూడ ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయింది. నగరం మొత్తం మేఘావృతమై ఉంది.

Mud Bath: అధికారులు బురదలో స్నానం చేస్తే వర్షాలు కురుస్తాయట.. పురాతన సంప్రదాయం

కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 25 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతావరణ శాఖ హెచ్చరించింది.

ఇటీవల కురిసిన వర్షాలు సృష్టించిన విలయం నుంచి తేరుకోక ముందే మళ్లీ వానలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బతిన్నాయి. భూముల్లో ఇసుకు మేటలు వేసింది. ముంపు నీరు ఇళ్లను ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. సమామాన్లు కొట్టుకుపోయాయి. ఆ కష్టాల నుంచి బయటపడక ముందే మళ్లీ వర్షాలు కరుస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.