Mud Bath: అధికారులు బురదలో స్నానం చేస్తే వర్షాలు కురుస్తాయట.. పురాతన సంప్రదాయం

ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్‌లో బీజేపీ ఎమ్మెల్యే జైమంగళ్ కనోజియాను బురదతో ముంచేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర పాలిక ఛైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మహిళలంతా ఆనందంతో పాటలు పాడారు.

Mud Bath: అధికారులు బురదలో స్నానం చేస్తే వర్షాలు కురుస్తాయట.. పురాతన సంప్రదాయం

Mud Bath

Mud Bath: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్‌లో బీజేపీ ఎమ్మెల్యే జైమంగళ్ కనోజియాను బురదతో ముంచేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర పాలిక ఛైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మహిళలంతా ఆనందంతో పాటలు పాడారు. ఎండ వేడిని తగ్గించుకునేందుకు గానూ చేసే ఆచారంలో భాగంగా మహిళలు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తుంది.

“నగర అధిపతికి బురద స్నానం చేయిస్తే ఇంద్రుడు సంతోషిస్తాడని నమ్మకం. తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో పంట దిగుబడి ఎక్కువగా ఉండటం లేదు” అని మహిళల్లో ఒకరైన మున్నీ దేవి వార్తా సంస్థకు తెలిపింది.

“ఇంద్రుడ్ని సంతోషపెట్టడానికి పిల్లలు బురదలో స్నానం చేస్తారని స్థానికంగా దీనిని కాల్ కలూటి అని పిలుస్తారు” అని అంటున్నారు స్థానికులు. నగరాధిపతికి తలస్నానం చేయడం వల్ల వర్షాన్ని కురిపించే వాన దేవుడు ప్రసన్నమవుతాడని పురాతన నమ్మకమట.

Mla

Mud Bath

ఈ ఆచారంలో పాల్గొనడం గురించి ఎమ్మెల్యే కనోజియా మాట్లాడుతూ.. పురాతన సంప్రదాయంలో భాగంగా పలువురు మహిళలు, పిల్లలు తమకు మట్టి స్నానం చేశారని చెప్పారు.

“ఆ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో చాలా మంది మహిళలు, పిల్లలు నాపై బురద పోశారు. ఇది ఇంద్రదేవుని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్లు పాటించే పురాతన సంప్రదాయంతో పాటు నమ్మకం. వారి ప్రార్థనలు వినాలని, త్వరలో వర్షాలు కురుస్తాయని కోరుకుంటున్నా” అని ఎమ్మెల్యే కనోజియా అన్నారు.

కరువు లాంటి పరిస్థితి మన ముందుందని జైస్వాల్ అన్నారు. మహిళలు వర్షపు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాంతంలోని పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.