Rains : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana Rains (10)

Rains In Telangana : వర్షాల కోసం ఎదురుచూస్తోన్న రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

IMD Red Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

గత నెల(జులై)లో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి.  భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంట నీటి మునిగింది. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి.

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, బీహార్ తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యమునా నది ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది.