Telangana Rains
Rains in Telangana: వేసవి తాపాన్ని చల్లార్చేందుకు శనివారం మధ్యాహ్నం సమయంలో తెలంగాణను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన వర్షానికి నగరంలోని వాతావరణం చల్లబడింది.
వాతావరణ విశ్లేషణ:
ఆదివారం ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి మరత్వడ్ మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుంది. దీనిని బట్టి రానున్న మూడు రోజుల్లో వాతవరణ సూచన ఇలా ఉండనుంది.
తెలంగాణా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతోకూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణ హెచ్చరికలు
ఆదివారం తెలంగాణా రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.