Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్..

ఆ కన్ స్ట్రక్షన్ ఫీడ్ బ్యాక్ ను అప్పటి సీఎం కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది.

Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్..

Smita Sabharwal

Updated On : September 24, 2025 / 12:20 AM IST

Smita Sabharwal: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తన పేరుని ప్రస్తావించడంపై స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను వివరణ ఇచ్చేందుకు తనకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల చెబుతున్నారు.

అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో స్మితా సబర్వాల్ పాత్రను కమిషన్ తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణాలను స్మితా సబర్వాల్ ఎప్పటికప్పుడు సందర్శించి, సమీక్ష చేసే వారని.. ఆ కన్ స్ట్రక్షన్ ఫీడ్ బ్యాక్ ను అప్పటి సీఎం కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం అడ్మినిస్ట్రేటివ్ అనుమతుల మంజూరులో స్మితా సబర్వాల్ కీలక పాత్ర ఉందని కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తెలిపింది. నిజానిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మితాపై చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.