Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో పొడి వాతావరణం, వడగాలులు..

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళలోని మిగిలిన ప్రాంతాల్లో, తమిళనాడులోని మరి కొన్ని ప్రాంతాలలోకి అవి ప్రవేశించాయి. అలాగే, ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో పొడి వాతావరణం, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోని అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలుల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.

ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.

Also Read: వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు