Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు.. శాఖల వారిగా వివరాలు ఇలా..

Telangana Govt : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి..

Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు.. శాఖల వారిగా వివరాలు ఇలా..

Telangana Government

Updated On : December 11, 2025 / 9:05 AM IST

Telangana Govt : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతోంది. మరో దఫా గ్రూప్-1 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 546 గ్రూప్ -1 ఖాళీలను భర్తీ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసిన సర్కార్.. తాజాగా.. మరో 250 గ్రూప్-1 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. వారం పదిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీబీపీఎస్సీ)కి లేఖరాయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుంది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇటీవల ఆయా జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో త్వరలో 45వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 61,379 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మొత్తం 50వేల ఉద్యోగాల భర్తీకి ఆయా ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి.

శాఖల వారీగా..
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3,200 ఖాళీలను భర్తీ చేయాలని ఆ సంస్థ ఎండీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 1500 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది. దీంతోపాటు పోలీసు శాఖలో కొత్తగా 12వేల నుంచి 18వేల మంది కానిస్టేబుళ్లను నియమించాలని హోంశాఖ నిర్ణయించింది. వీటితోపాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీలు ఏమైనా ఉంటే వాటి వివరాలను ఈనెల చివరిలోపు ఆయా శాఖల ముఖ్యకార్యదర్శుల ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లేఖలు రాశారు.

కేబినెట్ ఆమోదం తరువాత..
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు వచ్చాక మంత్రి మండలిని సమావేశపర్చి ఉద్యోగ ఖాళీల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. క్యాబినెట్ ఆమోదం తరువాత ఆర్థిక శాఖ అనుమతితో ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీతో పాటు ఆయా నియామక సంస్థలకు లేఖలు రానుంది.