Lionel Messi : లియోనెల్ మెస్సితో ఫొటో దిగాలనుందా..? చాలా కాస్ట్‌లీ గురూ.. రూ.10లక్షలు.. వాళ్లకు మాత్రమే.. కండిషన్స్ అప్లై
Lionel Messi : ప్రపంచ ప్రఖ్యాత పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (అర్జెంటీనా) హైదరాబాద్ రానున్నారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం
lionel messi
Lionel Messi : ప్రపంచ ప్రఖ్యాత పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (అర్జెంటీనా) హైదరాబాద్ రానున్నారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం మెస్సి హైదరాబాద్ నగరంలో అడుగుపెడతారు. ‘ది గోట్ ఇండియా టూర్-2025’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ‘గోట్ కప్’నకు అటెండ్ అవుతాడు. ఈ అర్జెంటీనా లెజెండ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటు ఫుట్‌బాల్ అభిమానులు, ఇటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎందరో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మెస్సీతో ఫొటో దిగాలని ఎందరో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, అవకాశం కూడా ఉంది. కానీ, అందుకు చాలా డబ్బులు చెల్లించాలి.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకునే అవకాశం కల్పించారు నిర్వాహకులు. అయితే, అందుకు భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మెస్సీతో ఒక్క ఫొటోకు రూ.10లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు. అయితే, ఫొటో దిగే అవకాశం కేవలం 100మందికి మాత్రమే ఉంటుందని ఆమె చెప్పారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సీతో మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగొచ్చు. ఒక్కో ఫొటోకు రూ.10లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫొటో దిగేందుకు డిస్ట్రిక్ట్ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కేవలం వంద మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని పార్వతి రెడ్డి తెలిపారు.
