Gold Silver Prices Today : వెండి రేటు పరుగో పరుగు.. బంగారం ధర మాత్రం.. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇవే..

Gold Silver Prices Today : అంతర్జాతీయ మార్కెట్లో మొన్నటి వరకు కాస్త నిలకడగా కొనసాగిన వెండి ధరలు ఇటీవల ఒక్కసారిగా ఎగబాకాయి.

Gold Silver Prices Today : వెండి రేటు పరుగో పరుగు.. బంగారం ధర మాత్రం.. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇవే..

Gold Silver Prices Today

Updated On : December 11, 2025 / 12:30 PM IST

Gold Silver Prices Today : బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రెండూ పోటాపోటీగా పరుగులు తీస్తున్నాయి. అయితే, గత కొద్దిరోజులుగా బంగారం కంటే వెండి మరింత దూకుడుపెంచింది. సరికొత్త గరిష్టాలను తాకుతూ పరుగులు పెడుతోంది. తాజాగా.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర తొలిసారి 60డాలర్లు మార్కును దాటేసింది.. దీనికి అనుగుణంగా భారతదేశ మార్కెట్లోనూ ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.2లక్షలు దాటింది.

Also Read : Hydrogen Train : బిగ్ న్యూస్.. భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది.. ఈ రైలు స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకవుతారు.. మీకు తెలియని 5 విషయాలివే..!

అంతర్జాతీయ మార్కెట్లో మొన్నటి వరకు కాస్త నిలకడగా కొనసాగిన వెండి ధరలు ఇటీవల ఒక్కసారిగా ఎగబాకాయి. బుధవారం కిలో వెండిపై రూ.8వేలు పెరగ్గా.. ఇవాళ (గురువారం) రూ.2వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2,09,000 వద్దకు చేరింది.

బంగారం ధర కాస్త తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 17డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,213 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,19,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,200కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,500 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,350కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,20,500 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,31,460కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,09,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,01,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,09,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.