Rajasingh warns BJP if suspension is not lifted
Rajasingh: భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ తాజాగా హెచ్చరిక చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. అయితే బీజేపీ సస్పెన్షన్ విధించినంత మాత్రాన తాను ఇతర పార్టీల్లోకి వెళ్లడం కానీ, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కానీ జరగదని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్ర నాయకత్వం తన మీద విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Bihar: గాల్వాన్ అమరవీరుడికి స్మారకం నిర్మించిన తండ్రి.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌తో వివాదాలు లేవని, అదంతా రూమర్ అని రాజాసింగ్ అన్నారు. బండి సంజయ్ తనకు శ్రీరామరక్ష అని అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారనే నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వల్ల బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన లేదని, తాను ధర్మం కోసం మాత్రమే పనిచేస్తానని రాజాసింగ్ అన్నారు.
Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఆందోళనలకు దారితీయడం, కేసు నమోదు, అరెస్ట్ తదితర పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఆయనను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.