Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు.

Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు.

New Delhi: ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. మనీశ్‌ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. సత్యేందర్ జైన్ దాదాపు 10 నెలలుగా జైలులోనే ఉన్నాడు. దీంతో ఆయనకు చెందిన మంత్రిత్వ శాఖలను సిసోడియానే నిర్వహిస్తున్నాడు. 33 మంత్రిత్వ శాఖల్లో 18 శాఖలను సిసోడియానే చూసుకుంటున్నారు.

Telangana BJP: అమిత్ షాతో ముగిసిన బీజేపీ నేతల భేటీ.. కేసీఆర్ అవినీతిపై ప్రచారం చేయాలని అమిత్ షా సూచన

అయితే, ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ కావడంతో ఆ శాఖలను సీఎం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాబినెట్‌లో కేజ్రీవాల్‌తోపాటు ఐదుగురు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజ్ కుమార్ ఆనంద్ మంత్రులుగా ఉన్నారు.