Telangana BJP: అమిత్ షాతో ముగిసిన బీజేపీ నేతల భేటీ.. కేసీఆర్ అవినీతిపై ప్రచారం చేయాలని అమిత్ షా సూచన

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జేపీ నద్దా సూచించారు. ఎవరికి వారు కాకుండా, నేతలంతా సమన్వయంతో పని చేయాలన్నారు.

Telangana BJP: అమిత్ షాతో ముగిసిన బీజేపీ నేతల భేటీ.. కేసీఆర్ అవినీతిపై ప్రచారం చేయాలని అమిత్ షా సూచన

Telangana BJP: ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో జరిగిన తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది.

Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జేపీ నద్దా సూచించారు. ఎవరికి వారు కాకుండా, నేతలంతా సమన్వయంతో పని చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. కేసీఆర్ అవినీతినే అస్త్రంగా మలచుకుని, ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!

ప్రజలకు దగ్గరయ్యేందుకు త్వరలో ఇంటింటికీ కమలం కార్యక్రమం చేపట్టాలని నద్దా, అమిత్ షా సూచించారు. సమావేశం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సమావేశ వివరాల్ని వెల్లడించారు. ‘‘బీజేపీ రాష్ట్ర నేతలకు హై కమాండ్ అనేక సూచనలు చేసింది. తెలంగాణలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపై చర్చించాం. 119 నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక ప్లాన్ ప్రకారం బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆధారాలుంటే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయి. లిక్కర్ కేసుకు, బీజేపీకి సంబంధం లేదు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.