Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆయన మార్చి 4 వరకు కస్టడీలో ఉండాల్సి ఉంది.

Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. దీంతో మంగళవారం సాయంత్రం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Mandali Buddha Prasad: ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది.. సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్ల నరికివేత: మండలి బుద్ధ ప్రసాద్

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆయన మార్చి 4 వరకు కస్టడీలో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం సిసోడియా సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, తన కస్టడీని సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని, ఆయనపై నమోదైన కేసు వ్యక్తిగతంగా, వ్యవస్థపై దాడి చేయడమే అని సిసోడియా తరఫు న్యాయవాదులు అంటున్నారు.

Maharashtra: ఉల్లి ధరల పతనం.. ఉల్లి దండలు వేసుకుని మహారాష్ట్రలో ఎమ్మెల్యేల వినూత్న నిరసన

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైనే సీబీఐ దర్యాప్తు జరుపుతోందని, సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేదని సిసోడియా తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. సిసోడియా అరెస్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతలు, ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు.