Mandali Buddha Prasad: ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది.. సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్ల నరికివేత: మండలి బుద్ధ ప్రసాద్

ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Mandali Buddha Prasad: ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది.. సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్ల నరికివేత: మండలి బుద్ధ ప్రసాద్

Mandali Buddha Prasad: ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోందని విమర్శించారు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలగడం దురదృష్టకరమన్నారు.

Covid-19 Virus: కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీకైన వైరసే.. అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక.. ఖండించిన చైనా ..

కడప జిల్లా వేంపల్లెలో మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి ఏ ఊరెళ్తే.. ఆ ఊళ్లో చెట్లను నరికేస్తున్నారు. చెట్లను పెంచాలే కానీ.. నరికి వేయడం ఏంటి? ఒకవైపు ప్రభుత్వం మొక్కలు పెంచాలని చెబుతూ.. మరోవైపు పెరిగిన చెట్లను నరకడం ప్రభుత్వానికి సరికాదు.

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు

ఇదేనా సమాజానికి ప్రభుత్వం ఇచ్చే సందేశం. మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. శాసనసభలో స్పీకర్ మాట్లాడే భాష కూడా సరిగ్గా లేదు. శాసన విలువలతో పాటు శాసన వ్యవస్థ అందరికి ఆదర్శంగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలకు స్పూర్తిదాతలుగా నిలవాలి. కాని జగన్ ప్రభుత్వంలో యాధా రాజా.. తథా ప్రజా అన్నట్లు మారింది. వైసీపీ పాలనలో పరిస్థితి ఎలా ఉందంటే పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు.. ప్రజలకు ఏమి స్ఫూర్తిని ఇస్తున్నారో అర్థం కావడం లేదు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారి భాష ఎలాంటిదో ప్రజలకు తెలుసు.

Chikoti Praveen: రూ.3కోట్ల రేంజ్‌ రోవర్ కారు.. చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు

ఆంధ్రప్రదే‌శ్‌లో ఉన్న వారందరూ తెలుగు భాష మాట్లాడే వాళ్లే. అలాంటి రాష్ట్రంలో తెలుగు భాషా మాధ్యమాన్ని రద్దు చేయడం బాధాకరం. పరబాషా పరిజ్ఞానం అవసరమే కాని మాతృభాషను మరవడం సరికాదు. పరాయి భాష జాతి వినాశనానికి దారి తీస్తుంది. తెలుగు భాష నశిస్తే తెలుగు జాతి నశిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీలో సాహిత్యానికి సంబంధం లేని వ్యక్తులను నియమించడం సరికాదు. ఇతర రాష్ట్రాల్లో సాహిత్యానికి అవార్డులు ఇస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం అలాంటి అవార్డులు ఇవ్వడం లేదు. ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.