Chikoti Praveen: రూ.3కోట్ల రేంజ్‌ రోవర్ కారు.. చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు

చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయలు విలువ‌చేసే రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును బినామీ పేరుమీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కారు వివరాలను తెలపాలంటూ ఐటీ నోటీసులు జారీ చేసింది.

Chikoti Praveen: రూ.3కోట్ల రేంజ్‌ రోవర్ కారు.. చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు

chikoti praveen

Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రోజుకో అంశంపై వార్తల్లో నిలుస్తున్నాడు. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. ఇటీవల కారు చోరీకి గురైందంటూ, గుర్తు తెలియని దుండగులు నా కారును దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తుచేపట్టిన పోలీసులు సీసీ పుటేజీల సహాయంతో కారును గుర్తించి అతనికి అప్పగించారు. తాజగా మరోసారి ప్రవీణ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆయనకు ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ. 3కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు విషయంలో ఈ సారి ఐటీ నుంచి ప్రవీణ్ నోటీసులు అందుకున్నాడు.

Chikoti Praveen: నా కారు చోరీ సాధారణ దొంగతనం కాదు: చికోటి ప్రవీణ్

చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయలు విలువ‌చేసే రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును బినామీ పేరుమీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కారు వివరాలను తెలపాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ షోకాజు నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొంది. ప్రవీణ్ ఈ కారును భాటియా ఫర్నీచర్ పేరుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలాఉంటే ఇప్పటికే ప్రవీణ్ ఫేమా కేసును ఎదుర్కొంటున్నారు. క్యాసినో వ్యవహారంలో గతంలో ఈడీ సోదాలు చేసింది.

Chikoti Praveen Car Robbery : కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇంటి దగ్గర కలకలం.. కారు కోసం వచ్చారా? హత్యకు రెక్కీ చేశారా?

చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారిగా తన జీవితాన్ని మొదలు పెట్టిన చికోటి ప్రవీణ్ అనంతరం సినిమాల్లో నిర్మాతగా మారిపోయాడు. నష్టాలు రావడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. గతంలో వనస్థలిపురంలో వైద్యుడిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రవీణ్ జైలుకుసైతం వెళ్లాడు. కొద్దికాలానికి జైలునుంచి వచ్చాక.. గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకొని పేకాట నిర్వహించడం మొదలు పెట్టాడు. ప్రవీణ్ తొలినాళ్లలో కేవలం జంట నగరాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినో మొదలు పెట్టాడు. రానురాను ఆయన సామ్రాజ్యాన్ని దేశ, విదేశాలకు విస్తరించుకున్నాడు. ఎంతలా అంటే.. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్ కు కస్టమర్లను తీసుకెళ్లేంత స్థాయిలో ఎదిగిపోయాడు. గతంలో ఈడీ నిర్వహించిన సోదాలతో చికోటి అక్రమ వ్యాపార సామ్రాజ్యం బయటకొచ్చింది. దేశవ్యాప్తంగా చికోటి వ్యవహారం సంచలనం సృష్టించింది.