Maharashtra: ఉల్లి ధరల పతనం.. ఉల్లి దండలు వేసుకుని మహారాష్ట్రలో ఎమ్మెల్యేల వినూత్న నిరసన

ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకుని, అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలియజేశారు.

Maharashtra: ఉల్లి ధరల పతనం.. ఉల్లి దండలు వేసుకుని మహారాష్ట్రలో ఎమ్మెల్యేల వినూత్న నిరసన

Maharashtra: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు దారుణంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉల్లి దిగుబడి పెరిగినా, ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర రైతులు గిట్టుబాటు ధర కూడా లేక అల్లాడిపోతున్నారు.

Mandali Buddha Prasad: ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది.. సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్ల నరికివేత: మండలి బుద్ధ ప్రసాద్

ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకుని, అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కేజీ ఉల్లిపాయల ధర రూ.2-4 వరకు మాత్రమే పలుకుతోంది. రైతులకు కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదు. సోమవారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

Cyber Cheaters : టెలిగ్రామ్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్.. కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ చీటర్స్

దీంతో రైతులు ఉల్లి విక్రయాలు నిలిపివేశారు. ఉల్లికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ ఉల్లికి ప్రభుత్వం రూ.1,500 చెల్లించాలన్నారు. కేజీ ఉల్లిపాయలకు కనీసం రూ.15-20 వరకు ధర ఉండాలన్నారు. అయితే, దేశంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన నాసిక్‌లో కేజీ ఉల్లి ధర రూ.2 నుంచి మొదలైంది. అంటే ఉల్లి రకాన్ని బట్టి క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.800 పలికింది. సగటున రూ.400-450 మాత్రమే ధర పలికింది. దీంతో నాసిక్‌లో రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయితే, రాష్ట్రానికి చెందిన స్థానిక మంత్రి ఉల్లి రైతులను ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు సోమవారం సాయంత్రం తమ నిరసన విరమించారు. దీంతో మంగళవారం నుంచి తిరిగి ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి.