Cyber Cheaters : టెలిగ్రామ్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్.. కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ చీటర్స్

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.

Cyber Cheaters : టెలిగ్రామ్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్.. కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ చీటర్స్

Cyber criminals

Cyber Cheaters : హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు. యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే కమీషన్ అంటూ మోసాలకు పాల్పడ్డారు. ముషీరాబాద్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని సైబర్ చీటర్స్ ట్రాప్ చేసి రూ.8 లక్షలు కాజేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇటు యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే కమీషన్ అంటూ వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ఒకవైపు పోలీసులు ఎంతగా అవేర్ నెస్ చేసినా నగరవాసులు సైబర్ చీటర్స్ చేతిలో చిక్కుకుని సర్వం కోల్పోతున్నారు. తాజాగా టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్లను ఎర వేసి సైబర్ చీటర్స్ సుమారు రెండున్నర కోట్ల రూపాయలకుపైగా దండుకున్నారు. నగరంలో ఆరుగురు బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని టెలిగ్రామ్ యాప్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

New Cyber Crime : వామ్మో.. కొత్త సైబర్ క్రైమ్.. మిస్డ్ కాల్ ఇచ్చి రూ. 50 లక్షలు కొట్టేశారు.. మీ ఫోన్‌కు ఇలా కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త..!

యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా లక్షల రూపాయల కమీషన్ వస్తుందంటూ మోసగించి లింక్ ను క్లిక్ చేసిన యూజర్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారు. ఇప్పటికే ఆరుగురు బాధితులు కూడా సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యంగా ముషీరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి సుమారుగా రూ.8లక్షలకుపైగా పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.