Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!

మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్‌కు అనుమతించింది.

Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!

Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ నిర్వహించాలనుకుంటున్న ర్యాలీకి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పలు షరతులకు అనుగుణంగా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది.

Mandali Buddha Prasad: ప్రకృతి వనరుల్ని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది.. సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్ల నరికివేత: మండలి బుద్ధ ప్రసాద్

దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్‌కు అనుమతించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆర్ఎస్ఎస్, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. భైంసా చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతం అని, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంటెలిజెన్స్ నివేదికను కోర్టుకు సమర్పించింది. రెండు సంవత్సరాల క్రితం భైంసాలో జరిగిన మత ఘర్షణల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

ఒక్క నినాదంతో మత విద్వేషాలు చెలరేగుతాయని కోర్టుకు తెలిపింది. అయితే, ఈ వాదనల్ని ఆర్ఎస్ఎస్ తరఫు న్యాయవాది ఖండించారు. భైంసా భారత దేశంలోనే ఉందని, గతంలో టిప్పు సుల్తాన్ జయంతి ర్యాలీకి కూడా పోలీసులు అనుమతించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కోర్టు ఈ ర్యాలీకి అనుమతించింది. అయితే, ర్యాలీలో ఎలాంటి నేర చరిత్ర లేని 500 మంది మాత్రమే పాల్గొనేలా చూడాలని ఆర్ఎస్ఎస్‌ను ఆదేశించింది. మసీదుకు 300 మీటర్ల దూరంలోనే ర్యాలీ నిర్వహించాలని, మసీదుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. ర్యాలీలో పాల్గొనే వాళ్లు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని చెప్పింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చూడాల్సిందిగా పోలీసుల్ని కోర్టు ఆదేశించింది.