కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్

చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Danam Nagender and Ranjith reddy

Danam Nagender and Ranjith reddy : చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే, ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది.

Also Read : BRS Party : బీఆర్ఎస్ పార్టీకి మరో ఎంపీ రాజీనామా.. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ

చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఆదివారం ఉదయమే ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి పోటీచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటంతో ఆయన చెవెళ్ల నుంచి పోటీచేస్తారని, సునీత రెడ్డికి మల్కాజ్ గిరి నియోజకవర్గం టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు