Ration Card e-KYC : రేషన్‌ కార్డు దారులకు అలర్ట్.. ఈ-కేవైసీ గడువు పెంపు.. ఒకేసారి మూడు నెలల బియ్యం..

Ration Card e-KYC : తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది.

Ration Card Holders

Ration Card e-KYC : తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. వాస్తవానికి ఈ-కేవైసీకి జులై 31 చివరి తేదీ. ఈ-కేవైసీ పూర్తికాకుంటే నిత్యావసర సరకులు అందే అవకాశం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో ఈ-కేవైసీ చేయని లబ్ధిదారులకు ఊరట నిచ్చినట్లయింది.

Also Read : Financial Rules August 1 : ఆగస్టు 1 నుంచి రాబోయే కీలక మార్పులివే.. LPG గ్యాస్ ధరల నుంచి బ్యాంకు ఛార్జీల వరకు.. సామాన్యుల జేబుకు చిల్లే..!

భారీ వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను దృష్టిలో పెట్టుకొని ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పెంచినట్లు సీఆర్ఓ రాజిరెడ్డి తెలిపారు. ఎవరైనా నేరుగా తమ దగ్గరలోని రేషన్ షాపునకు వెళ్లి బయోమెట్రిక్ లో వేలిముద్రలు ఇవ్వండం ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు రేషన్ లబ్ధిదారులకు మరోసారి మూడు నెలలకు ఒకేసారి రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయించారు. ఆగస్టు, సెప్టెంబరు, ఆక్టోబరు నెలకు కలిపి ఒకేసారి బియ్యం ఆగస్టు నెలలో పంపిణీ చేయనున్నారు.