TSPSC paper leak: పేపర్ లీక్ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ సస్పెన్షన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో నిందితులుగా రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik) ఉన్న విషయం తెలిసిందే. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. పేపర్ లీక్ నిందితులు రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik)పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక పనిచేస్తోంది.

ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ కి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నివేదిక పంపారు. దీని ఆధారంగా రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీవో ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా రేణుక భర్త డాక్యా నాయక్ పనిచేస్తున్నారు.

విధుల నుంచి ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పేపర్ లీక్ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో పలువురు రాజకీయ నాయకులు పలు ఆరోపణలు చేయడంతో ఆధారాల కోసం వారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.

పేపర్ లీక్ జరిగిందని గుర్తించడంతో ఇప్పటికే తాజా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడంతో ఆ ఆధారాల కోసం వారికి కూడా నోటీసులు అందాయి.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు,గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

ట్రెండింగ్ వార్తలు