తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా తన భార్య పద్మావతి రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హుజూర్ నగర్ అభ్యర్థిగా పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకమాండ్ కు చెప్పకుండా ఉప ఎన్నిక అభ్యర్థిని ఉత్తమ్ ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
AICC వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను రేవంత్ రెడ్డి కలిసి కంప్లెయింట్ చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఉత్తమ్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రేవంత్ అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రేవంత్ కు కుంతియా చెప్పినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం జరిగిన ఓ బహిరంగ సభలో తన సతీమణి,మాజీ ఎమ్మెల్యే పద్మావతి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఉత్తమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన కోరారు.